ములుగు, 2026-06-05
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ఆదివాసి సంఘాల సన్నాహ సమీక్ష సమావేశం జరిగింది. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగపేట మండలంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

విస్తృత ప్రచారం
ఈ సందర్భంగా, ఆదివాసి గ్రామాలు, గూడేలు ఆదివాసి పచ్చ జెండాను ఎగరవేసి, మండల కేంద్రంలో జరిగే కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని ఆదివాసి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ సమీక్ష సమావేశంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నల్లెబోయిన లక్ష్మణ్ దొర, జిల్లా మీడియా కన్వీనర్ ఎట్టి సారయ్య దొర, ఆదివాసి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గొప్ప సమ్మారావు, అధ్యక్షులు కొండా చెంచయ్య, ఆదివాసీ మన్య సీమ పరిరక్షణ సమితి మండల అధ్యక్షులు తాటి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు గొప్ప చంద్రం, తోలెం సౌమ్య, ఇర్ప అరుణ, ఆదివాసి హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కుర్సం రమేష్, జిల్లా ప్రచార కార్యదర్శి సోయం ఈశ్వరయ్య, డివిజన్ అధ్యక్షులు పోదేం నాగేశ్వర్ రావు, మండల అధ్యక్షులు పూనెం ప్రశాంత్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తోలెం రామకృష్ణ, కొప్పుల నవీన్, బోడెబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.