వాజేడు, 2026-06-05
ములుగు జిల్లా ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, పరిష్కరించాలని గ్రామ ప్రజావాణి, పరిధిలోని పరిష్కరించాలని, రేగులపాడు, గుర్తించి,, బయ్యారం కాలనీ ప్రాంతాల్లో నెలకొన్న పలు భద్రత అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో,స్తులు, మేరకు గ్రామస్తులు, ఆదివాసీ నాయకులు కలిసి ఎంపీడీఓకు
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, చెరుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చెరుకూరు, రేగులపాడు, మోతుకూలగూడెం, బయ్యారం కాలనీ ప్రాంతాల్లో నెలకొన్న పలు సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు గ్రామస్తులు, ఆదివాసీ నాయకులు కలిసి ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు.
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వీధి దీపాలు, తాగునీరు, బోరు పంపులు, డ్రైనేజీ, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం, విద్యుత్ భద్రత వంటి సమస్యలను వినతిపత్రంలో వివరించారు. ప్రజల ఆరోగ్యం, భద్రత, దైనందిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు.
చెరుకూరు గ్రామంలో గత మూడు నెలలుగా పనిచేయని వీధి దీపాలను మరమ్మతు చేసి పునరుద్ధరించాలని, మోతుకూలగూడెం వాటర్ ట్యాంక్ ద్వారా తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. గ్రామంలో పాడైన బోరు పంపులను గుర్తించి, మరమ్మతులు చేసి ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీరామ ఫెర్టిలైజర్ షాప్ నుంచి వెళ్లే సీసీ రోడ్డు చివర అవసరమైన డ్రైనేజీ తూమును ఏర్పాటు చేయాలని కోరారు. చెరుకూరు సెంటర్లో పాఠశాల ముందు భాగంలో మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు, విషపురుగులు పెరుగుతున్నాయని, ప్రజలు, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామంలోని మురుగు కాలువలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, చెత్తను తొలగించడం, ప్రతి వార్డులో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమలు, విషపురుగుల నివారణకు అవసరమైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు.
అదేవిధంగా, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, నీరు సక్రమంగా వెళ్లేలా డ్రైనేజీ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసి తొలగించాలని కోరారు. గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న పాడుబడిన బావులను గుర్తించి, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోడెం నాగరాజు, జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్, పాయం జానకిరావు, వాసం సంతోష్ కుమార్, గ్రామస్తులు పాయం ఆంజనేయులు, యాలం ఆదిత్య, పీర్ల రాంబాబు, కోరం మనోజ్ కుమార్, పీర్ల రవిరాజు, యాలం అశోక్, వాసం ఈశ్వరరావు, వాసం నరసింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.








