ఎటపాక దమ్మక్కగూడెం కాలనీ డంపింగ్ యార్డ్ ఎదురుగా నివసిస్తున్న గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎటపాక తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇంటి పన్ను రసీదులు, మంచినీటి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలోని డంపింగ్ యార్డ్ ఎదురుగా తాటాకు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న ఈ కుటుంబాలు, భద్రాచలం పట్టణంలో కూలి పనులు, ఇతర చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం, గ్రామస్తులు అధికారులు తమ సమస్యలను ఆలకించి, తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. ఎంపీడీవో కార్యాలయంలోని అధికారులకు కూడా ఇదే వినతిపత్రాన్ని అందజేశారు.
గిరిజన నాయకురాలు సావిత్రి, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు సాయన్న, ఎమ్మార్పీఎస్ నాయకులు అల్వాల రాజా, లతా మాట్లాడుతూ, నిరుపేదలైన ఈ కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, వారికి ఇంటి పన్ను రసీదులు ఇవ్వడంతో పాటు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి, భాస్కరు, గోపాలరావు, మల్లికార్జున, రమణ, శిరీష, ప్రవళిక, రాజమ్మ, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.












