వెంకటాపురం, 2023-08-31
ఆదివాసీల హక్కులు, ఉద్యోగాలు, భూములు, చట్టాల అమలు కోసం తుడుందెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐటీడీఏ కేంద్రాల్లో ఆదివాసీ మార్చ్‌లు నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన పిలుపునిచ్చారు.
ఆదివాసీల హక్కులు, ఉద్యోగాలు, భూములు, చట్టాల అమలు కోసం తుడుందెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐటీడీఏ కేంద్రాల్లో ఆదివాసీ మార్చ్‌లు నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన పిలుపునిచ్చారు. వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణంలో ఆదివాసి మార్చ్ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని తుడుం దెబ్బ మండల అధ్యక్షులు తుర్స చంటి ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో నిర్వహించారు. ముందుగా మండల కేంద్రాల్లోని కొమరం భీమ్ విగ్రహానికి నివాళులర్పించి ఆదివాసీ మార్చ్ పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డా. అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఆదివాసీల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆదివాసీల రిజర్వేషన్ల పరిరక్షణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో 29 శాఖల ఉద్యోగాలను ఐటీడీఏ ద్వారా భర్తీ చేయాలని ఆయన కోరారు. పోడు భూములకు పట్టాలు, గిరివికాస్ బోర్లు, ఆదివాసీ ప్రాంతాలకు సాగునీరు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి, పరిశ్రమల్లో ఆదివాసీలకు ఉద్యోగాలు, వాటా కల్పించాలని ఆయన కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఆదివాసీ మార్చ్‌ల షెడ్యూల్‌ను ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 7న ఏటూరునాగారం, 16న ఉట్నూర్, 21న భద్రాచలం, 28న మన్ననూరులో ఆదివాసీ మార్చ్‌లు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన ఆదివాసీ యువతకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, అట్టం సుభద్ర, నల్లబోయిన లక్ష్మణరావు, కబాక లక్ష్మణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనేం వరప్రసాద్, పర్షిక గోపాల్, ఆదివాసి సీనియర్ నాయకులు యాలం సాయి, యువత, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.








