Charla, 2026-08-09
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేశవాపురం గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహం వద్ద ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కాపుల శారద అధ్యక్షతన కొమురం భీమ్ విగ్రహానికి నివాళులర్పించి, జెండా ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు.

కొమురం భీమ్ పోరాటం చిరస్మరణీయం
ఈ సందర్భంగా సర్పంచ్ కాపుల శారద మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు కొమురం భీమ్ అని కొనియాడారు. జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. ఆదివాసీ సమాజం కోసం ఆయన చేసిన సేవలు, త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
యువతకు సర్పంచ్ పిలుపు
కొమురం భీమ్ ఆశయాలను ఆదివాసీ యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, తమ హక్కులపై అవగాహన పెంచుకుని సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఘనంగా నివాళులర్పించిన ప్రజలు
ఈ కార్యక్రమంలో కాపులు శారద, కూనారపు సతీష్, కాపుల నాగరాజు, కోరం నాగేంద్ర, తాటి పాపారావు, హిమగిరి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, సూరిబాబు, రామారావు, కృష్ణ, సుబ్బారావు, శ్రీను, రాదా, సోడి వెంకటరమణ గ్రామ ప్రజలు, ఆదివాసీ నాయకులు, యువత, మహిళలు తదితరులు పాల్గొని కొమురం భీమ్‌కు ఘన నివాళులు అర్పించారు.