Charla, 2026-08-07
చర్ల మండల కేంద్రంలో కొమరం భీమ్ విగ్రహ పనులను 9 ఆదివాసి తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ పరిశీలించారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున విగ్రహం ఏర్పాటు చేసుకోవడం గొప్ప శుభపరిణామమని ఆయన అన్నారు.
చర్ల మండల కేంద్రంలో కొమరం భీమ్ విగ్రహ పనులను 9 ఆదివాసి తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ పరిశీలించారు. శుక్రవారం చర్ల మండల కేంద్రానికి విచ్చేసిన ఆయన, ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున ఆదివాసి పోరాట వీరుడు కొమరం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆదివాసి యువత, ఉద్యోగులు, ప్రజానీకానికి గొప్ప శుభపరిణామమని అన్నారు.
పోరాట స్ఫూర్తికి నివాళి
వారి పోరాట పటిమను గుర్తుంచుకుని, రాబోయే ఆదివాసి సమాజం కోసం నిలబడాలని సూచించారు.
చలో కొత్తగూడెం పిలుపు
అనంతరం, చలో కొత్తగూడెం కార్యక్రమానికి ఆదివాసి ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివాసి తుడుం మోతతో లంబాడి హటావో, ఆదివాసి గొంతుకలు నినదించాలని అన్నారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో ఆదివాసీ సీనియర్ నాయకులు ఇర్ప. వసంత్, ఇర్ప. ప్రకాష్, కారం. నరేష్, సోడి అనిల్ కుమార్, కోరం. బిట్టు, కోరం. సూర్యనారాయణ, ఇర్ఫా. అరుణ్ కుమార్, కోరం వేణు పాల్గొన్నారు.












