ములుగు, 2026-06-05
ప్రతి ఆదివాసి గూడేలలో ఆకుపచ్చ జెండాలు ఎగరాలని ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ () పిలుపునిచ్చింది. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ములుగు వెంకటాపురం మండల వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించి, బోధపురం గ్రామంలో ఆదివాసీలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రతి ఆదివాసి గూడేలలో ఆకుపచ్చ జెండాలు ఎగరాలని ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ () పిలుపునిచ్చింది. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ములుగు వెంకటాపురం మండల వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించి, బోధపురం గ్రామంలో ఆదివాసీలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు
ఈ సందర్భంగా ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ () నాయకులు పూనెం రామచందర్, పూనెం సాయి దొర మాట్లాడుతూ.. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి ఆదివాసి గూడేలలో ఘనంగా నిర్వహించాలని, పచ్చ జెండాలు ఎగురవేయాలని, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను పాటించాలని ఆదివాసి ప్రజానీకానికి పిలుపునిచ్చారు.
చట్టాల అమలుపై డిమాండ్లు
5వ షెడ్యూల్ భూభాగంలో 1/70, పిసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుల పెత్తనం చెల్లదని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏజెన్సీ ఏరియాలో 1/70 చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజనేతరుల తరలింపు, ఉద్యోగాలపై స్పష్టత
ఏజెన్సీ ప్రాంతం నుండి గిరిజనేతరులను మైదాన ప్రాంతాలకు తరలించాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో పిసా గ్రామ సభల ద్వారానే పార్లమెంటు చట్టమైన 1/70 చట్టాన్ని 5వ షెడ్యూలు భూభాగంలో పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి, 3 జీవో ప్రకారం 100 ఉద్యోగాలు ఆదివాసీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమాలపై సూచన
1/70 చట్టం అమలుకై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధపురం గ్రామ ప్రజలు, యువత, ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కనీతి వెంకటకృష్ణ, కుంజ మహేష్, వాసం నారాయణ, ఉండం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.












