భద్రాద్రి కొత్తగూడెం, 2026-08-01
భద్రాచలం నియోజకవర్గాన్ని గోదావరి వరదల నుంచి శాశ్వతంగా రక్షించాలని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు దొర డిమాండ్ చేశారు. ఏటా వరదల వల్ల ప్రజలు ఆస్తులు, పంటలు, జీవనోపాధి కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రాచలం నియోజకవర్గానికి గోదావరి వరదల నుంచి శాశ్వత రక్షణ కల్పించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక - భద్రాచలం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు దొర డిమాండ్ చేశారు.
ప్రతి సంవత్సరం గోదావరి వరదల కారణంగా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు తదితర మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి ప్రజల ఆస్తులు, పంటలు, జీవనోపాధి నష్టపోతున్నాయని తెలిపారు.
అందువల్ల వరదలు వచ్చినప్పుడు తాత్కాలిక సహాయక చర్యలకే పరిమితం కాకుండా, గోదావరి వరదల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని కోరారు. వరద ముంపు ప్రాంతాలకు శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని, వరద నియంత్రణకు శాస్త్రీయమైన సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, ముంపు గ్రామాల ప్రజలకు శాశ్వత రక్షణ, పునరావాస చర్యలు కల్పించాలని, రైతులు, ఆదివాసీ ప్రజల పంటలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని, ప్రతి సంవత్సరం వరదలతో నష్టపోతున్న ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
“వరద వచ్చినప్పుడు సహాయం కాదు – వరద రాకుండా శాశ్వత పరిష్కారం కావాలి” అని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని ఇరప. రాజు దొర కోరారు.










