Charla, 29/06/2026
తెలంగాణ సరిహద్దుల్లో లంబాడీల స్వర్ణోత్సవ బస్సు యాత్రను అడ్డుకుంటామని, బద్దలు కొట్టడానికి యువత సిద్ధంగా ఉండాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. చర్ల మండల కేంద్రంలో తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ రోడ్డు దిగ్బంధం చేసి నిరసన తెలిపింది. లంబాడీలు రిజర్వేషన్లను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ సరిహద్దులో లంబాడీల స్వర్ణోత్సవ బస్సు యాత్రను అడ్డుకుంటామని, బద్దలు కొట్టడానికి ప్రతి గూడెం యువత సిద్ధంగా ఉండాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తుడుందెబ్బ కమిటీలు అడ్డుకుంటాయని ఆయన ముక్తకంఠంతో తెలిపారు.
చర్ల మండల కేంద్రంలోని సుబ్బంపేట గ్రామంలో తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర పోలిటి బ్యూరో సభ్యులు వాసం ముసలయ్య ఆధ్వర్యంలో తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ రోడ్డును దిగ్బంధం చేసి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, 1976లో దొడ్డి దారిన కలిపిన లంబాడీలు, అత్యవసర కాలాన్ని వక్రీకరించి భారత రాజ్యాంగం విరుద్ధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో ఉన్నామని అబద్ధాలు చెబుతూ రిజర్వేషన్ల మొత్తాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. IAS, IPS, IRS, IFS నుంచి అటెండర్ వరకు ఉద్యోగాలు అనుభవిస్తూ, అసలైన అడవి బిడ్డలకు దక్కాల్సిన ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లను కూడా అనుభవిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు.
లంబాడీలు ఈ దేశ సంచార జాతులని, బ్రిటిష్ ప్రభుత్వంలో క్రిమినల్ ట్రైబ్స్‌గా చలామణి అయ్యారని పేర్కొన్నారు. చరిత్రలో ఈ దేశ మూలవాసి, ఆదివాసి అయిన ఆది అనే మొదటి వాడిగా మానవ నాగరికత, పర్యావరణాన్ని, ప్రపంచ మానవాళి మనుగడ, పురోగతిని సాధించిన గొప్ప జాతి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు వాసం ముసలయ్య, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు ధారబోయిన రమేష్, ఆదివాసీ స్టూడెంట్ జేఏసీ కన్వీనర్ ఇర్ప ప్రకాష్ దోర, తుడుందెబ్బ భద్రాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు సోడి అనిల్, ఉద్యోగ జేఏసీ సభ్యులు సరేం సమ్మయ్య, తుడుదెబ్బ మండల నాయకులు పూనెం రవికిరణ్, కోరం భిక్షపతి, కలం శ్రీను, సోడి రవి, సరేం హరిదీప్, ఇర్ప భరత్, ఇర్ప అరుణ్, సోడి సందీప్, అలెం కిషోర్, కుర్సం హరి తదితరులు పాల్గొన్నారు.












