ములుగు, 2026-07-31
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని గోదావరి ముంపు ప్రాంతాల గ్రామ ప్రజలను పునరావసతి కేంద్రాలకు తరలించినట్లు DLPO శ్రీధర్ స్పష్టం చేశారు. రామన్నగూడెం, ఏటూరు నాగారం మేజర్ పంచాయతీలలోని కొన్ని గ్రామాలు గోదావరి ముంపు బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్, మంత్రి ఆదేశాల మేరకు అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని గోదావరి ముంపు ప్రాంతాల గ్రామ ప్రజలను పునరావసతి కేంద్రాలకు తరలించినట్లు DLPO శ్రీధర్ స్పష్టం చేశారు. రామన్నగూడెం, ఏటూరు నాగారం మేజర్ పంచాయతీలలోని కొన్ని గ్రామాలు గోదావరి ముంపు బారిన పడే అవకాశం ఉందని తెలిపారు.
జిల్లా కలెక్టర్, మంత్రి ఆదేశాల మేరకు అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఏటూరు నాగారం మండల కేంద్రంలోని గిరిజన భవనం, డిగ్రీ కళాశాల భవనాలను పునరావసతి కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ప్రజల కోసం అన్ని రకాల వసతులు కల్పించినట్లు ఆయన తెలిపారు.
ఈ విషయమై మరిన్ని వివరాలను మీడియా ముఖంగా తెలియజేసినట్లు శ్రీధర్ పేర్కొన్నారు.












