భద్రాద్రి కొత్తగూడెం, 31-07-2026
భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజలు, రైతులు, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు మరియు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నూగూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప. శ్రీనివాస్ రావు విజ్ఞప్తి చేశారు. గోదావరి నదిలో పెరుగుతున్న ప్రవాహం నేపథ్యంలో అధికారులు జారీ చేస్తున్న హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజలు, రైతులు, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు మరియు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నూగూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప. శ్రీనివాస్ రావు విజ్ఞప్తి చేశారు.
గోదావరి నదిలో ప్రవాహం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు జారీ చేస్తున్న హెచ్చరికలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. నది పరివాహక ప్రాంతాలకు అనవసరంగా వెళ్లకూడదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.
రైతులు తమ పశువులు, వ్యవసాయ పరికరాలు, ధాన్యం మరియు ఇతర విలువైన వస్తువులను ముందస్తుగా భద్రపరచుకోవాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరియు అనారోగ్యంతో ఉన్నవారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, పోలీసు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు జారీ చేసే సూచనలను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణ రక్షణే అందరి బాధ్యత అని, అప్రమత్తతే ప్రమాద నివారణకు మార్గమని తెలిపారు.











