నారాయణపేట, 3 July
నారాయణపేట జిల్లాలోని గుడిబల్లూరు పంప్ హౌస్ వద్ద మిషన్ భగీరథ కార్మికులు తమ సమస్యలపై నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ వర్కర్స్గా గుర్తించాలని, నెల మొదటి తేదీనే వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పెంచిన వేతనాలు సకాలంలో అందడం లేదని, గుర్తింపు సమస్యలున్నాయని కార్మికులు ఆరోపించారు.
మిషన్ భగీరథ కార్మికులను కాంట్రాక్ట్ వర్కర్స్గా గుర్తించాలని, నెల మొదటి తేదీనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా, కృష్ణా మండలం గుడిబల్లూరు పంప్ హౌస్ వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెంచిన వేతనాలు నెల మొదటి తేదీన రాకపోవడం, మిషన్ భగీరథ కార్మికులను కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించకపోవడం సిగ్గుచేటని కార్మికులు ఆరోపించారు. నిత్యం గ్రామాలలో నీటి సరఫరా చేస్తున్న తమకు జీవో 6 ప్రకారం పెంచిన జీతాలను వర్తింపజేసి, ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
మిషన్ భగీరథ అధికారులు కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని, పీఎఫ్, ఈఎస్ఐ కట్టడం లేదని, సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటన కార్మికులకు ఆశ కలిగించినా, అది నిరాశగానే మిగిలిపోయిందని వాపోయారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 26 సంవత్సరాలుగా కొనసాగుతున్న మక్తల్ సత్యసాయి స్కీంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి విడుదల చేసిన వేతనాలు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏజీ, భుట్టో, టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు డి. శ్రీనివాస్, మిషన్ భగీరథ కార్మిక సంఘం కార్యదర్శి, ఉపాధ్యక్షులు తిప్రేస్పల్లి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు రవి, రవిప్రసాద్, సాబేర్ మియా, నారాయణ, మహేష్, కుమార్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.











