ఖమ్మం, 5 July
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పెంకు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులు IFTUకు రాజీనామా చేసి, ప్రజాపంథా అనుబంధ సంఘమైన TUCIలో చేరారు. ముకుందాపురం సెంటర్లో జరిగిన ఈ చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు నాయకులు కార్మికులకు TUCIలో స్వాగతం పలికారు.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పెంకు ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు నేడు IFTUకు రాజీనామా చేసి, ప్రజాపంథా అనుబంధ సంఘమైన TUCIలో చేరారు. ఈ సందర్భంగా ముకుందాపురం సెంటర్లో TUCI జిల్లా నాయకులు ఆర్. బోస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు చిన్న చంద్రన్న, అరుణ అక్క, నాయిని రాజు, TUCI రాష్ట్ర నాయకులు కొత్తపల్లి రవి, జగ్గన్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్. మధుసూదన్ రెడ్డి, షేక్ యాకూబ్ షావలి, TUCI మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బిళ్ళ కంటి సూర్యం లు కార్మికులను TUCI లోకి సాదరంగా ఆహ్వానించారు.
TUCIలో చేరిన వారిలో తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ రామ్ సింగ్, టైల్ వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శి మూతి రాంబాబు, యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సనప రాంబాబు, కోశాధికారి దుర్గాప్రసాద్, నాయకులు బానోత్ శంకర్, రాజమ్మ, కవిత, బక్కమ్మ, వినయ్, మావిడాల రాజు, సత్యవతి, రామారావు, రాంబాబు, బజారి, సత్తిబాబు, శివ, తోలెం శ్రీను, అప్పలరాజు, పూల్ సింగ్ తదితరులు ఉన్నారు.











