Charla, జూలై 4
చర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10:00 గంటలకు కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ప్రారంభం కానుంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సెంటర్ ద్వారా రైతులకు, ప్రజలకు అనేక ప్రభుత్వ, బ్యాంకింగ్ సేవలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయి.
చర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10:00 గంటలకు కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరుకానుండగా, జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావు, CSC జిల్లా మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, PACS అధ్యక్షులు పరిచూర్ రవి తదితరులు పాల్గొననున్నారు.
ఈ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా రైతులు, ప్రజలకు అనేక రకాల ప్రభుత్వ, బ్యాంకింగ్ సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. ఆధార్ నమోదు, అప్డేట్ సేవలు, పాన్ కార్డు సేవలు, ఓటర్ కార్డు సేవలు, పాస్పోర్ట్ దరఖాస్తులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, డిజీ పే (Digi Pay) ద్వారా బ్యాంకింగ్ సేవలు, బీమా సేవలు, వివిధ ప్రభుత్వ ధ్రువపత్రాల దరఖాస్తులు, రైతులకు అవసరమైన పలు ఆన్లైన్ సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చర్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని PACS అధ్యక్షులు పరుచూరి రవి కుమార్, PACS కార్యదర్శి డి. రామచంద్ర ప్రభు విజ్ఞప్తి చేశారు.










