*" (సహస్ర) జూలై 02
గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పురోభివృద్ధి, కూలీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అమలాపురం మండలం, ఏ వేమవరం గ్రామంలో నూతనంగా రూపాంతరం చెందిన "వికసిత్ భారత్ జి రామ్ జి"పథకాన్ని అమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారు, డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ గారు కలిసి గురువారం ఘనంగా ప్రారంభించారు. గతంలో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు "వికసిత్ భారత్ జి రామ్ జి" పథకంగా మార్చాయి.
గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పురోభివృద్ధి, కూలీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అమలాపురం మండలం, ఏ వేమవరం గ్రామంలో నూతనంగా రూపాంతరం చెందిన "వికసిత్ భారత్ జి రామ్ జి"పథకాన్ని అమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారు, డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ గారు కలిసి గురువారం ఘనంగా ప్రారంభించారు.
గతంలో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు "వికసిత్ భారత్ జి రామ్ జి" పథకంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కేవలం పేరు మార్చడమే కాకుండా, గ్రామీణ ప్రాంత పేద కూలీలకు మరింత ఎక్కువ కాలం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో, గతంలో ఏడాదికి ఉన్న 100 పని దినాలను ఇప్పుడు 120 రోజులకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని ఈ సందర్భంగా గ్రామంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే ఆనందరావు గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదలకు, సామాన్యులకు అండగా నిలవడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. పని దినాలను 120 రోజులకు పొడిగించడం ద్వారా గ్రామీణ కూలీల కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. ఏ వేమవరం గ్రామాన్ని, అమలాపురం మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కలెక్టర్ గారి సహకారంతో నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ.. "వికసిత్ భారత్ జి రామ్ జి" పథకం ద్వారా లబ్ధిదారులందరికీ సరైన సమయంలో పనులు కల్పించి, నిధులు సక్రమంగా అందేలా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ఆస్తుల కల్పనలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.












