ములుగు, 29 జూలై 2026
ూల కూలూలూలనన భిలల వషల నేథయలోమలమల జలూల అమ ఉడలని, ూలనిలల ూల, విదయూల భద జలూల ిలల ూలకోవలని ఏటూూలన మేజ మచయిలల చ కకూలలమి శిలల ల లకషమణ బబూల ూల ూచిచూల. ోలూల కూలడ జలూల ిలల ూలకోవలని ఆమె విజఞి చేశూల.
ఉపరితల ప్రభావంతో ఎడతెరిపి లేకుండా రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలోములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, విద్యుత్ భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామపంచాయతీ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు తెలియజేశారు.
వర్షాల కారణంగా వివిధ రకాల రోగాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. వర్షాల వల్ల తాగునీరు కలుషితమై రోగాలు వచ్చే అవకాశం ఉన్నందున, మిషన్ భగీరథ నీటితో సహా ప్రతి ఒక్కరూ నీటిని బాగా కాచి, చల్లార్చిన వేడి నీటిని మాత్రమే తాగాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, భారీ వర్షాల నేపథ్యంలో తడిసిన విద్యుత్ స్తంభాలు, వైర్లు మరియు ఇతర పరికరాల పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించి, గ్రామపంచాయతీ యంత్రాంగానికి సహకరించాలని కోరారు.









