ములుగు, 2026-07-18
గభతవలోజలేఫఅధలలేడతోదెబబీభతవధలఆవీహలోత'తడ'షఅధయషలడైతఅణఅఆవీలోడభూలజోలవతేణలతీవగఉయఆయహభొతతగూడజలలడలగగగలోఆవఆయవయఖయలేశ
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన కంటే ఫారెస్ట్ అధికారుల పాలనే నడుస్తోందని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి 'తుడుం దెబ్బ' రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ అన్నారు. ఆదివాసీల పోడు భూముల జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బందగిరి నగర గ్రామంలో ఆదివారం ఆదివాసి హక్కుల పోరాట సమితి 'తుడుం దెబ్బ' రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలబోయిన వెంకట్ నారాయణ, భద్రాద్రి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు కలివేటి పవన్ ఆ గ్రామాన్ని సందర్శించారు.
2005కు ముందు సాగులో ఉన్న భూములను ఫారెస్ట్ శాఖ అధికారులు కావాలని 100 ఎకరాలు దౌర్జన్యంగా తీసుకొని జామాయి తోట పెట్టారని, పక్కనున్న 80 ఎకరాలు ఇస్తామని మాయమాటలు చెప్పి గత ఏడు నెలలుగా సాగు చేసుకుంటున్న ఆదివాసి భూములలోకి వచ్చి, మీకు ఎటువంటి హక్కు పత్రాలు లేవని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. స్ట్రెంచులు కొట్టి, మొక్కలు పెట్టినట్లు తెలిపారు.
2022లో అటవీ హక్కుల చట్టం (FRC) కమిటీ ద్వారా పట్టాల కోసం దరఖాస్తు చేస్తే, ఎవరి భూములలో వారిని ఫోటోలు తీయకుండా, కావాలని గ్రూపుగా ఫోటోలు తీసి, భూములు ఇస్తామని ఇంగ్లీషులో పత్రాలు పట్టుకొచ్చి, ఇవి మీకు పట్టాలు ఇచ్చే కాగితాలని సంతకాలు తీసుకొని, పొజిషన్లో లేమని దొంగ సంతకాలు తీసుకొని, సాగు చేసుకుంటున్న భూములలో ఫారెస్ట్ అధికారులు పట్టాలు రాకుండా చేశారని అరుణ్ కుమార్ ఆరోపించారు.
మళ్లీ వచ్చి పోలీస్ శాఖ ప్రొటెక్షన్తో జేసీబీలు పట్టుకొచ్చి భూముల చుట్టూ స్ట్రెంచీలు కొడుతున్నారని, ఈ క్రమంలో ఆదివాసీలు ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా భూములను కాపాడుకోవాలని, అధికారులతో రక్తం ఏరులై పారినా తమ భూములను కాపాడుకుంటామని పోరాటానికి దిగారని తెలిపారు.
ఐదో షెడ్యూల్ భాగంలో ఉన్న ఐటీడీఏ పీఓకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, పీఓ అటవీశాఖకు నివేదించినా, ఐటీడీఏ ద్వారా నిజ నిర్ధారణ కోసం సర్వే చేయించినా పట్టించుకోవడం లేదని అన్నారు. 5వ షెడ్యూల్ భూభాగంలో జీవో 57 ప్రకారం సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అమలులో ఉన్న పీఓ అధికారాలను ఎలా ఉల్లంఘిస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. అసలు ఏజెన్సీ చట్టాలు అమలులో ఉన్నాయా లేదా అర్థం కావడం లేదని అన్నారు. పీఓ సర్వే కోసం ఆదేశించినప్పుడు అటవీశాఖ మొక్కలు ఎలా పెడుతుందో సమాధానం చెప్పాలని కోరారు.
ఆదివాసి పోడు భూములలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కంపెనీ నిధులను ఫారెస్ట్ అధికారులే కాంట్రాక్టర్లుగా మారి, ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియక అమాయక ఆదివాసుల భూములలో స్ట్రంచలు కొడుతూ, మొక్కలు పెడుతూ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అటవీశాఖ కనుక ఈ భూముల జోలికి వస్తే ప్రత్యక్ష తిరుగుబాటు 'తుడుం దెబ్బ' ఆధ్వర్యంలో తప్పదని, 500 మంది కొమరం భీం సైన్యంతో ఈ గ్రామ పోడు భూములను కాపాడుకోవడం కోసం కొమరం భీమ్ పోరాట పంథాను అనుసరిస్తామని హెచ్చరించారు.








