భద్రాద్రి కొత్తగూడెం, 2026-07-18
మిషన్ భగీరథ భద్రాచలం సబ్డివిజన్లో విశిష్ట సేవలందించి బదిలీపై వెళ్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DyEE) పీ. ఏసుబాబు, ఇంట్రా ఏఈ వి. రాములకు చర్ల రైతు వేదికలో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడుతూ, ఘనంగా వీడ్కోలు పలికారు.
మిషన్ భగీరథ భద్రాచలం సబ్డివిజన్లో విశిష్ట సేవలందించి బదిలీపై వెళ్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DyEE) పీ. ఏసుబాబు మరియు ఇంట్రా ఏఈ వి. రాములకు చర్ల రైతు వేదికలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం మాట్లాడుతూ, డీఈ ఏసుబాబు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రజలకు నాణ్యమైన తాగునీటి సరఫరా అందించడంలో ఆయన విశేష కృషి చేశారని తెలిపారు.
సన్మానానికి స్పందించిన డీఈ పీ. ఏసుబాబు మాట్లాడుతూ, "మిషన్ భగీరథ సిబ్బంది నాకు పిల్లలలాంటి వారు. అందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. ఉద్యోగంలో చిన్నచిన్న పొరపాట్లు సహజమే. వాటిని సరిదిద్దుకుంటూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి. అందరూ భవిష్యత్తులో మంచి స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
ఇంట్రా ఏఈ వి. రాము తన సేవా అనుభవాలను పంచుకుంటూ, చర్లలో పనిచేసిన కాలాన్ని ఎప్పటికీ మరువలేనని, సహోద్యోగులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ ఎం. అరుణ్ కుమార్, ఇంట్రా డీఈఈ రవితేజ, ఇంట్రా ఏఈ ఉపేందర్ (దుమ్ముగూడెం), ఇంట్రా ఏఈ నారాయణరావు (భద్రాచలం), ఇరిగేషన్ ఏఈ సంపత్, ఎంపీఓ మూర్తి (చర్ల), చర్ల ఉప సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, సీనియర్ నాయకులు కాపుల నాగరాజు చర్ల మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, మండల కార్యదర్శులు, మిషన్ భగీరథ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బదిలీపై వెళ్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికి, వారి భవిష్యత్ సేవలకు శుభాకాంక్షలు తెలిపారు.









