చర్ల మండలం, తుడుందెబ్బలో ఆదివారం జరిగిన ఒక సమావేశంలో యువత పెద్ద సంఖ్యలో తుడుందెబ్బలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ నాయకత్వంలో భవిష్యత్ ఉద్యమాలను కొనసాగించడంలో యువత పాత్ర కీలకమని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులకు పదవులు కూడా కేటాయించారు.
సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆదివాసీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ ఉద్యమాలు సజావుగా సాగాలంటే, యువత తుడుందెబ్బకు రథసారథులుగా మారాలని, ఉద్యమాన్ని దగ్గరుండి నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
లంబడీలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే యువత ముఖ్యమని, భవిష్యత్ కార్యాచరణను వివరిస్తూ, ప్రతి గ్రామంలో, ప్రతి గూడేంలో తుడుందెబ్బ విస్తరించాలని, ప్రతి ఇంట్లో ఉద్యమ స్ఫూర్తి నింపాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశం అనంతరం, తుడుందెబ్బ సీనియర్ నాయకులు వాసం ముసలయ్యను తుడుందెబ్బ రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. ఆదివాసీ యువ నాయకులు పూనెం వరప్రసాద్‌ను తుడుందెబ్బ భద్రాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు.
ఈ కార్యక్రమంలో చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు, ఆదివాసీ సీనియర్ నాయకులు కుర్సం రాంబాబు, తుడుందెబ్బ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు ధరబోయిన రమేష్, తుడుందెబ్బ మహిళా రాష్ట్ర నాయకురాలు వట్టం సుభద్ర, తుడుందెబ్బ సీనియర్ నాయకులు తాటి రామకృష్ణ, చర్ల మండల తుడుందెబ్బ యువ నాయకులు శ్యామల తరుణ్, పూనెం రవికిరణ్, కలం శ్రీనివాస్, కోరం భిక్షపతి, ఇర్ప అరుణ్ కుమార్, ఇర్ప అరుణ్ తేజ్, ఇర్ప సాయికిరణ్, కోరం వేణు, మడప అనిల్ తదితరులు పాల్గొన్నారు.












