దుమ్ముగూడెం మండలం, చిన్న బండిరేవు గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. ఆయన చిన్న బండిరేవు గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ గృహానికి ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి గృహాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీ పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.
గృహ ప్రవేశ వేడుకలో భాగంగా, ఎమ్మెల్యే లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందించారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.












