అమలాపురం, 29 June
అమలాపురంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 14 మందికి స్థానిక స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భారీ జరిమానాలు విధించింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వీరిని మేజిస్ట్రేట్ చామకూరి నాగేశ్వరావు ఎదుట హాజరుపరచగా, మొత్తం రూ.1,45,000 జరిమానా విధించారు.
అమలాపురంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన పద్నాలుగు మందికి స్థానిక స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భారీ జరిమానాలు విధించింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిని సోమవారం మేజిస్ట్రేట్ చామకూరి నాగేశ్వరావు ఎదుట హాజరుపరచగా, ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.11 వేల చొప్పున మొత్తం రూ.55 వేలు, తొమ్మిది మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.90 వేలు.. మొత్తం రూ.1,45,000 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా అమలాపురం పట్టణ సీఐ వీరబాబు మాట్లాడుతూ, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు.












