ములుగు, జూలై 31
ములుగుజిల్లా,వెకటాపురమడల మండల గిరిజన గిరిజన గ్రామాల్లోనిసుమారు600మదినిరుపేదవిద్యార్థులకుగ్రేస్సర్వీస్సొసైటీఆధ్వర్యలోవిద్యాసామగ్రినిపపిణీచేశారు.జి.ఎస్.ఎస్చైల్డ్కేర్కేద్రాలలోజరిగినఈకార్యక్రమలోస్కూల్బ్యాగులు,నోట్‌బుక్స్,పలకలుఅదిచారు.
ములుగు జిల్లా, వెంకటాపురం మండల గిరిజన గ్రామాల్లో గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. టేకులబోరు, మంగవాయి, ముక్కునూరుపాలెం, రామచంద్రపురం, మొర్రవానిగూడెం, ఆలుబాక, బర్రెబొంద మరియు ఏదిర గ్రామాల్లోని జి.ఎస్.ఎస్ చైల్డ్ కేర్ కేంద్రాలలో సుమారు 600 మంది నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్ మరియు పలకలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, చైల్డ్ కేర్ సెంటర్ ఇన్చార్జీలు, స్టాఫ్, సంస్థ సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, గ్రేస్ సర్వీస్ సొసైటీ నిర్వహిస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం ద్వారా వారి చదువుపై ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న గ్రేస్ సర్వీస్ సొసైటీని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలుబాక సర్పంచ్ పూజారి ఆదిలక్ష్మి, ఇంచార్జ్ రాయుడు సాధన, మొరం డేవిడ్, మురవానిగూడెం రాయుడు, జయరాజు టీచర్స్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.












