Charla, July 30
చర్ల మండలంలోని పుసుగుప్ప రోడ్డులో భారీ వర్షాల కారణంగా బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు దెబ్బతినడంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా భారీ వాహనాల రాకపోకలను చర్ల పోలీసులు తాత్కాలికంగా నిషేధించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సీఐ ఏ. రాజు వర్మ తెలిపారు.
చర్ల మండల పరిధిలోని పుసుగుప్పకు వెళ్లే రహదారిలో రోటెంత వాగు సమీపంలో ఇటీవల నూతనంగా నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారుల భద్రత దృష్ట్యా, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు భారీ వాహనాల రాకపోకలను చర్ల పోలీసు శాఖ నిషేధించింది. ఈ మార్గంలో ప్రయాణించే గ్రామస్తులు మరియు ఇతర ప్రయాణికులు అప్రమత్తంగా ఉండి, తగు జాగ్రత్తలు పాటించాలని చర్ల సీఐ ఏ. రాజు వర్మ గారు తెలిపారు.












