రాజోలు, 04-07-2026
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు, అమలాపురం మహిళా పోలీస్ స్టేషన్ SHO షేక్ షాబాజ్ అహ్మద్, కొత్తపేట డిఎస్పి సుంకర మురళి మోహన్ ల ఆధ్వర్యంలో రాజోలు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సదస్సులో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, వేధింపులపై మార్గదర్శకాలు అందించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ ఆదేశాల మేరకు, అమలాపురం మహిళా పోలీస్ స్టేషన్ SHO డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ షేక్ షాబాజ్ అహ్మద్, కొత్తపేట డిఎస్పి శ్రీ సుంకర మురళి మోహన్ ఆధ్వర్యంలో రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజోలు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆవరణలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యువతకు జరిగే ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న వేధింపులు, ఫేక్ కాల్స్, OTP మోసాలు, QR కోడ్ స్కామ్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
అపరిచిత వ్యక్తులతో బ్యాంక్ వివరాలు, OTPలు, వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు, మోర్ఫింగ్ ఫోటోలు, బ్లాక్ మెయిలింగ్ వంటి నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మొబైల్ ఫోన్లలో బలమైన పాస్వర్డ్లు మరియు Two-Factor Authentication వినియోగించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న శక్తి యాప్‌ను ప్రతి మహిళ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్‌లోని SOS సదుపాయం ద్వారా వెంటనే పోలీస్ సహాయం పొందవచ్చని వివరించారు. మహిళల భద్రత కోసం 181 హెల్ప్‌లైన్ మరియు అత్యవసర సేవల కోసం 112 ను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాజోలు సిఐ వి సురేష్ బాబు, రాజోలు ఎస్సై శ్రీ మల్లికార్జున్ రెడ్డి, రాజోలు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి సాయి బాబా, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.












