అమలాపురం, 3 July
అమలాపురం: హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ లో శిక్షణ పొందుతున్న ఎనమదల ఇందిర, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా - ఏలూరు వెయిట్ లిఫ్టింగ్ అకాడమీకి ఎంపికైంది. జూన్ నెలలో జరిగిన సెలక్షన్ ట్రైల్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అగ్రస్థానంలో నిలిచిన ఆమెకు ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ గుమమ్ సింగ్ ద్వారా సెలక్షన్ ఉత్తర్వులు అందినట్లు కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు.
హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ పొందుతున్న ఎనమదల ఇందిర, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా - ఏలూరు వెయిట్ లిఫ్టింగ్ అకాడమీకి ఎంపికైంది. జూన్ నెలలో జరిగిన సెలక్షన్ ట్రైల్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, అగ్రస్థానంలో నిలిచి ఏలూరు వెయిట్ లిఫ్టింగ్ అకాడమీకి ఎంపికైనట్లు ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ గుమమ్ సింగ్ ద్వారా సెలక్షన్ ఉత్తర్వులు ఇందిర అందుకున్నారని కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి, క్యాంప్ ఆఫీస్ వద్ద ఎనమదల ఇందిరను సన్మానించి, అభినందించారు. ఇండియాలోనే అత్యుత్తమ వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ అకాడమీల్లో ఒకటైన ఏలూరు వెయిట్ లిఫ్టింగ్ అకాడమీకి ఎంపికైన ఇందిర, దేశంలోనే అత్యుత్తమ వెయిట్ లిఫ్టర్ గా తర్ఫీదు పొంది, ఎందరికో ఆదర్శంగా నిలవాలని, జీవితంలో స్థిరపడాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ వెయిట్ లిఫ్టర్స్ మారే వీరేంద్ర, వై. పల్లం రాజు, జి. దినేష్ ప్రసాద్ పాల్గొన్నారు.












