అమలాపురం, 1 July
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ ఆదేశాల మేరకు, అమలాపురం మహిళా పోలీస్ స్టేషన్ SHO శ్రీ షేక్ షాబాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ASN మహిళా కళాశాలలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సదస్సులో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, వేధింపులపై మహిళలకు సూచనలు అందించారు.
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఆమలాపురం మహిళా పోలీస్ స్టేషన్ SHO, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ షేక్ షాబాజ్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ASN మహిళా కళాశాల ఆవరణలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యువతకు జరిగే ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న వేధింపులు, ఫేక్ కాల్స్, OTP మోసాలు, QR కోడ్ స్కామ్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
అపరిచిత వ్యక్తులతో బ్యాంక్ వివరాలు, OTPలు, వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు, మోర్ఫింగ్ ఫోటోలు, బ్లాక్ మెయిలింగ్ వంటి నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మొబైల్ ఫోన్లలో బలమైన పాస్వర్డ్లు మరియు Two-Factor Authentication వినియోగించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న శక్తి యాప్‌ను ప్రతి మహిళ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్‌లోని SOS సదుపాయం ద్వారా వెంటనే పోలీస్ సహాయం పొందవచ్చని వివరించారు. మహిళల భద్రత కోసం 181 హెల్ప్‌లైన్ మరియు అత్యవసర సేవల కోసం 112ను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అమలాపురం టౌన్ CI పి. వీరబాబు గారు మరియు ASN కళాశాల ప్రిన్సిపాల్ మహాలక్ష్మి గారు పాల్గొన్నారు.












