YSR Kadapa/Badvel (సహస్ర) జూన్ 30
వెంకటాపురం మండలం, సుదిబాక గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడు మడప భాస్కర్ విద్యుత్ షాక్తో శరీరంలో 60 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. హైదరాబాద్లో చికిత్సకు రూ.20-30 లక్షలు ఖర్చయినా, ఆర్థిక స్తోమత లేక కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు చొరవతో యువకుడికి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
సేవే లక్ష్యంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు... నిరుపేద యువకుడికి పునర్జన్మనిచ్చిన వైద్య బృందం.
వెంకటాపురం మండలం, సుదిబాక గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడు మడప భాస్కర్ విద్యుత్ షాక్కు గురై శరీరంలో సుమారు 60 శాతం వరకు తీవ్ర కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. హైదరాబాద్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించగా, సుమారు రూ.20 లక్షల నుండి రూ.30 లక్షల వరకు ఖర్చయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబం చికిత్స కోసం తమ పొలాలను కూడా విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక చికిత్స కొనసాగించే స్థోమత లేక తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులు భద్రాచలం ఎమ్మెల్యే, ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ తెల్లం వెంకటరావు గారిని ఆశ్రయించారు. వారి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, రోగిని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేర్పించి, అవసరమైన వైద్య సేవలను అందించేలా చర్యలు చేపట్టారు.
ఆసుపత్రిలో జనరల్ సర్జన్ అందుబాటులో లేని పరిస్థితుల్లో, స్వయంగా జనరల్ సర్జన్ అయిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు నాలుగు నుంచి ఐదు గంటలపాటు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ బి. దేవరాజ్ (ఆర్థోపెడిక్ సర్జన్), డాక్టర్ తాటి మల్లేష్, డాక్టర్ నికిత, డాక్టర్ కౌండిన్య, నర్సింగ్ సిబ్బంది, అనస్థీషియా బృందం, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది సమిష్టిగా కృషి చేశారు.
ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వై. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి క్లిష్టమైన కేసుకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు స్వయంగా శస్త్రచికిత్స చేయడం అభినందనీయమని, ఆయన సేవాభావం ప్రభుత్వ వైద్య సేవల పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం రోగి ఆరోగ్యం మెరుగుపడుతూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
రోగి తల్లిదండ్రులు మాట్లాడుతూ, "చికిత్స కోసం మా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మాకు దారి కనిపించని సమయంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు, భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మా బిడ్డకు కొత్త జీవితం ఇచ్చారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాము" అని భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు.











