*🕯️ (సహస్ర) జూలై 06
ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో స్వర్గీయ చారుగుండ్ల నాగ వరప్రసాద్ గారి దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఆయన స్వర్గీయ నాగ వరప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో స్వర్గీయ చారుగుండ్ల నాగ వరప్రసాద్ గారి దశదినకర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వర్గీయ నాగ వరప్రసాద్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
రాజారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని తాటి వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నందమూరి సురేష్, యినుగంటి రాము, అనుమాల నరసింహారావు, ఎర్రగుంట కృష్ణ, శనగపాటి సీతారాములు, బండి కొమరయ్య, కోప్పుల మోహన్ రావు, కొవ్వులూరి ప్రసాద్, దేవినాథ్, బంతు నందు, సాయి తదితరులు పాల్గొన్నారు.











