Charla, జూలై 6
చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సైడ్ డ్రైన్ల శుభ్రత పనులు చేపట్టారు. గ్రామంలో మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు డ్రైన్లలో పేరుకుపోయిన చెత్త, పూడికను తొలగించి పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలివేరు గ్రామ సర్పంచ్ తెల్లం లక్ష్మణరావు మాట్లాడుతూ, పరిశుభ్రమైన గ్రామ నిర్మాణానికి ప్రతి గ్రామస్థుడు సహకరించాలని కోరారు. ఇంటి చెత్తను డ్రైన్లలో వేయకుండా నిర్ణీత ప్రదేశాల్లో వేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు గ్రామపంచాయతీ నిరంతరం చర్యలు తీసుకుంటోందని, ప్రజల సహకారంతో కలివేరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.