Charla, 2026-09-02
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వై ఎస్ ర్ సేవలు చిరస్మరణీయం
ఘనంగా చర్లలో దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ,వర్ధంతి వేడుకలు
పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి
చర్ల, సెప్టెంబర్ 2 ( ): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ, వర్ధంతి వేడుకలను చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల శ్రీనివాసరావు, మాజీ ఎంపిటిసి కుంజా చంటి,మెడబత్తిన వాసు, ఎస్సీ సెల్ చర్ల మండలం అధ్యక్షులు మచ్చ రాజా, పూజారి రమణయ్య,మునిగేలా వెంకన్న, గూడపాటి రంజిత్, చెన్నం పవన్,పాలెం నవీన్ కుమార్, కాయం శ్రీను, కేదారి వంశీ, బొల్లా వినోద్, పరవా శంకర్,సున్నం గంగరాజు, గడ్డం నాగరాజు, పోగల్ల సత్తిబాబు, సిద్ధి సత్యనాధం,రజినీకాంత్, నాగరాజు,సుధాకర్,బిక్షపతి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు...








