మానుగూరు, 2026-09-05
మణుగూరు మండలం శివలింగాపురం గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. లబ్ధిదారుడైన కోతపల్లి ఉపేంద్ర కుటుంబానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
*నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు* మణుగూరు, శివలింగాపురం గ్రామం | | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం శివలింగాపురం గ్రామానికి చెందిన కోతపల్లి ఉపేంద్ర నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని, లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇల్లు పూర్తిచేసుకుని గృహప్రవేశం చేసుకున్న ఉపేంద్ర కుటుంబానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.








