ములుగు, 2 September
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆయన అభిమానులు ఘనంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.
పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అభిమానుల సేవా కార్యక్రమాలు వెంకటాపురం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు మొక్కలు నాటారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.








