వెంకటాపురం, 5 September
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు అక్రమంగా పట్టాలు మంజూరు చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు 1/70, పీసా వంటి చట్టాలను ఖూనీ చేస్తున్నారని గోండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ ఆరోపించారు. మండల కేంద్రంలో జరిగిన సంఘం సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు.
అక్రమ పట్టాల పై చర్యలు తీసుకోవాలి. గోండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షుడు పూనేం ప్రతాప్... అధికారులకి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యమే.. పట్టింపే లేని మండల రెవెన్యూ అధికారి. వలస గిరిజనేతరుల అక్రమ పట్టాలు రద్దు చేయాలని,గొండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షుడు పూనేం ప్రతాప్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఆర్,ఎం,బి గెస్ట్ హౌస్ ఆవరణలో గోండ్వానా సంక్షేమ పరిషత్ సంఘ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ హాజరై మాట్లాడుతూ.ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుల భూబదలాయింపులు నిరోధించే 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీ భూములు గిరిజననేతర్ల పరం కాకూడదు అనే ఉద్దేశంతో అనాటి ప్రభుత్వాలు తెచ్చిన,ఎల్ టి ఆర్,1/70,పిసా చట్టాలను రెవిన్యూ అధికారులు ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. మండలం మరికల(జెడ్)లో అనేక భూ అక్రమాలు జరిగాయని,వాటికి నిదర్శనంగా సర్వేనెంబర్ 123,122,120 గల సర్వే నెంబర్లు గిరిజనేతరులకు వందల ఎకరాల అక్రమ పట్టాలు చేశారని పూనెం ప్రతాప్ అన్నారు.డిజిటల్ రికార్డులు తారుమారు చేస్తూ, భూభారతిలో డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ తో నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరుల పేర్లను నమోదు చేస్తూ అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.తప్పుడు పత్రాలతో 1/70 నిబంధనలు ఉల్లంఘించి భూమి హాక్కుపత్రాలు పొందారని,ఇది రెవెన్యూ అధికారులకి తెలిసిన ఎందుకు మౌనం వహిస్తున్నారని,ఇది చాలా సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు.ఈ అక్రమ పట్టాల విషయమై మండల రెవెన్యూ అధికారికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని ఆయన మండిపడ్డారు.త్వరలో ఈ విషయమై హైకోర్టు పిటిషన్ దాఖలా చేసి పట్టా మార్పిడి సవాల్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాటి రాజేష్,తాటి లక్ష్మయ్య,భీమయ్య,సిద్దు,చంటి,కొమరయ్య,రమేష్,చందు,తదితరులు పాల్గొన్నారు.








