ములుగు, 2026-06-05
వెంకటాపురం మండల విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) హనుమాన్ దాస్‌ను ములుగు ఎన్పీడీసీఎల్ సంస్థకు సరెండర్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏఈపై వచ్చిన పలు ఫిర్యాదులు, విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.

ఆరోపణలు
విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఇందిరమ్మ ఇళ్ల విద్యుత్ కనెక్షన్లలో జాప్యం చేసినట్లు ఆరోపణలున్నాయి. లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు అందాయి. రైతులకు విద్యుత్ స్తంభాల విషయంలో అవకతవకలు జరిగినట్లు రైతులు ఆరోపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం కొత్త స్తంభాలు వేసే క్రమంలో అవకతవకలు జరిగాయని, అర్హులైన రైతులకు స్తంభాలు వేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు సమాచారం. దీనిపై రైతులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు.
సరెండర్ ఉత్తర్వులు
దీనిపై ఉన్నత అధికారులు విచారణ జరిపి వెంకటాపురం ఏఈని వెంటనే ములుగు ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేసినట్లు ములుగు ఏఈ బిక్షపతి తెలిపారు. సరెండర్ వార్త తెలియగానే మండలంలోని రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.