ములుగు, 2026-06-05
ములుగు జిల్లా అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మంత్రి సీతక్క సమన్వయంతో జరిగిన ఈ పర్యటన అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణుల విస్తృత ఏర్పాట్లతో విజయవంతంగా ముగిసింది. మేడారం నుంచి ములుగు వరకు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది.
ములుగు జిల్లా అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మంత్రి సీతక్క సమన్వయంతో జరిగిన ఈ పర్యటన అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణుల విస్తృత ఏర్పాట్లతో విజయవంతంగా ముగిసింది. మేడారం నుంచి ములుగు వరకు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది.
మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం
మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో సమ్మక్క సారలమ్మ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి స్థానిక ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆలయ ప్రాంగణంలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కులు చెల్లించుకుని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సీఎంకు ఆప్యాయంగా అమ్మవారి బొట్టు పెట్టారు. సమ్మక్క సారలమ్మ తల్లుల సన్నిధిలో మంత్రి సీతక్క ముఖ్యమంత్రికి రాఖీ కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు సమ్మక్క సారలమ్మ బంగారం (బెల్లం)ను బహూకరించారు. మంత్రి సీతక్క ముఖ్యమంత్రికి నూతన వస్త్రాలు, సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రసాదాలను అందజేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లకు కూడా నూతన వస్త్రాలను బహూకరించారు. ఆలయంలో భక్తులను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించి వారితో కరచాలనం చేశారు.
మహిళా సంక్షేమానికి చేయూత
ములుగులో వితంతు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. పలువురు మహిళలకు స్వయంగా పింఛన్లు అందించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి ముచ్చటించి, వారితో ఫొటోలు దిగారు. ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా మహిళా సంఘాలకు అందుతున్న ప్రయోజనాలను సభ్యులు సీఎంకు వివరించారు. సొంత వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా బలోపేతం అవుతున్న మహిళల విజయగాథలను దివ్య దేవరాజన్ ముఖ్యమంత్రికి వివరించారు. మహిళా సంఘాల సభ్యులు సీఎంకు ఇప్పపువ్వు లడ్డూలను బహూకరించారు.
ములుగు అభివృద్ధికి భారీ ఊతం
ములుగులో పంచాయతీరాజ్ రహదారుల పైలాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కలిసి ఆవిష్కరించారు. అనంతరం ములుగు సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ఇద్దరూ కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్పెషల్ సీఎస్ దాన కిశోర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క ప్రసంగం








