ములుగు, 2024-07-26
ముుగుసరకోవదయుతశఖసమీకషసమవేశండైరెకటర(ఆపరేషన)ట.మధుసూదనఆధవరయంోరగంద.ఈసందరభంగవదయుతవనయోగదరుకునణయమైన,నరంతరయవదయుతసరఫరఅందంచడంతోపటు,సంకేతక,వణయనషటనుతగగంచేందుకుచరయుచేపటటనఅధకరుకుసూచంచరు.
ములుగు సర్కిల్లో విద్యుత్ శాఖ సమీక్ష సమావేశం జరిగింది. డైరెక్టర్ (ఆపరేషన్) టి. మధుసూదన్ ఆధ్వర్యంలో ఈరోజు ములుగు జిల్లా సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో, విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించే దిశగా సమర్థవంతమైన చర్యలు అమలు చేయాలని ఆదేశించారు.
పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు త్వరితగతిన లైన్ల నిర్మాణం పూర్తి చేసి విద్యుత్ సరఫరా కల్పించాలని సూచించారు. రానున్న విద్యుత్ లోడ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రతిపాదిత నూతన ఉపకేంద్రాలు, 33 కేవీ, 11 కేవీ లైన్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విద్యుత్ అంతరాయాలను తగ్గించడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ప్రతి అధికారి ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్) కె. రాజ్ చౌహాన్, సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. బిక్షపతి, డివిజనల్ ఇంజనీర్లు కన్నా రాజు (టెక్నికల్ & ఆపరేషన్, ములుగు), ఎన్. సదానందం (MRT & Construction, భూపాలపల్లి), జె. పురుషోత్తం (ఆపరేషన్, ఏటూరునాగారం), సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంతోష్ (ములుగు), అలాగే పలువురు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.










