వెంకటాపురం, 3 September
వరంగల్లో జరగనున్న జాతీయ సదస్సును విజయవంతం చేయాలని ఎంఎస్పీ పార్టీ మండల అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మండల కేంద్రంలోని వెంగళరావుపేట గ్రామంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. అనంతరం చలో వరంగల్ కరపత్రాలను ఆవిష్కరించారు.
వరంగల్ లో జరిగే జాతీయ సదస్సును జయప్రదం చేయండి.. ఎమ్ ఎస్ పి మండల అధ్యక్షులు _వేల్పుల వెంకటేష్.. ములుగు జిల్లా మండల కేంద్రంలోనీ వెంగళరావుపేట గ్రామంలో MSP పార్టీ మండల అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ మాదిగ ఆధ్వర్యంలో న వరంగల్.లోజరిగే జాతీయ సదస్సుని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం,అనంతరం MSP చలో వరంగల్ కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది.గ్రామ ,మండలాల్లో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి , మండల కమిటీలు సదస్సును ఘనంగా జరుపుకోవాలని సూచించారు.పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు గ్రామ, గ్రామాన ప్రజలు.తరలిరావాలని కోరడం జరిగింది. న వరంగల్లో MRPS–MSP జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల మండల కమిటీలపై కీలక సమావేశం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS), మహాజన సోషలిస్టు పార్టీ (MSP) ఆధ్వర్యంలో సంస్థాగత బలోపేతానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా న వరంగల్లో MRPS–MSP జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల మండల కమిటీల నిర్మాణంపై కీలక సమావేశం నిర్వహించనున్నట్లు జాతీయ కమిటీ వెల్లడించింది. సంస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, జిల్లాలు–మండలాల్లో నూతన కమిటీల ఏర్పాటుపై సమావేశంలో చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1,200కు పైగా మండలాలు ఉండగా, ఇప్పటికే దాదాపు 60 శాతం మండలాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిగిలిన మండలాల్లోనూ త్వరితగతిన కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రతి మండలంలో MRPS–MSPతో పాటు అనుబంధ సంఘాలను బలోపేతం చేసి, మాదిగల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో వేల్పుల చిరంజీవి,వేల్పుల నర్సింహారావు, సమ్మయ్య,చిట్యాల లాలయ్య , జక్కయ్య,సర్వేశ్వరరావు, రాజ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.








