Charla, 2026-07-01
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో వైద్యులను మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. ఆసుపత్రిలోని డాక్టర్లను శాలువాలతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ప్రాణాలు కాపాడే వైద్యులను దైవంతో సమానంగా భావిస్తారని ఆయన కొనియాడారు.
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో వైద్యులను మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. ఆసుపత్రిలోని డాక్టర్లను శాలువాలతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇర్ప శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. సమాజంలో ప్రాణాలు కాపాడే వైద్యులను దైవంతో సమానంగా భావిస్తారని కొనియాడారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటూ నిరుపేద ప్రజలకు రాత్రింబవళ్లు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల కృషి ఎంతో అభినందనీయమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చైర్మన్ స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి ఉచితంగా, కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్య సేవలు అందాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, అత్యాధునిక వైద్య పరికరాల సమకూర్పు, అలాగే అవసరమైన మందుల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆసుపత్రులను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
కరోనా వంటి విపత్కర కాలం నుండి నేటి వరకు ప్రజారోగ్య పరిరక్షణలో ముందుంటున్న డాక్టర్ల నిబద్ధతను ఈ సందర్భంగా ప్రశంసించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మరింత ఆప్యాయతతో, మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వానికి, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని చైర్మన్ కోరారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాది పరిటాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.











