Charla, 2026-06-28
సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్యాధికారి డాక్టర్ దివ్య నయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ శ్రీ మురళి (IAS) ముఖ్య అతిథిగా హాజరుకాగా, గ్రామ సర్పంచ్ శ్రీమతి గౌతమి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్యాధికారి డాక్టర్ దివ్య నయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ శ్రీ మురళి (IAS) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి గౌతమి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (HEO) బాబురావు, హెల్త్ సూపర్వైజర్ (F) తిరుపతమ్మ, ఫార్మసిస్ట్ శ్రీదేవి, ఏఎన్ఎం విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ శాంతి, ఆశా కార్యకర్త ఎస్. అనూష, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












