ములుగు, 2026-06-05
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పురుగుమందులు విత్తనాల ఎదుర్కొంటున్న రవాణా ఖర్చులు . విధానం సమస్యలకు పరిష్కారం చూపాలని ఫెర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు తోట మల్లికార్జునరావు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్‌కు వినతి పత్రం అందజేశారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లు ఎదుర్కొంటున్న రవాణా ఖర్చులు, హోల్‌సేల్ వ్యాపారుల లింక్ విధానం వంటి సమస్యలకు తగిన పరిష్కారం చూపాలని ఫెర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు తోట మల్లికార్జునరావు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్‌కు వినతి పత్రం అందజేశారు.
మారుమూల ప్రాంతంలో ఇబ్బందులు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ మండలం మారుమూల ప్రాంతంలో ఉండటంతో వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను ఇతర ప్రాంతాల నుండి తెప్పించుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంకటాపురం ప్రాంతం రైల్వే హెడ్ నుండి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ కారణంగా రవాణాకు అధిక కిరాయి చెల్లించాల్సి వస్తోందని, ఇది డీలర్లపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోందని వివరించారు. అదే సమయంలో రైతులకు సరసమైన ధరలకు వ్యవసాయ ఇన్పుట్స్ అందించాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని పేర్కొన్నారు.
రవాణా ఖర్చుల భారం తగ్గించాలి
కావున, తమ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు తగిన ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు.
.
.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండలం ఫెర్టిలైజర్ అసోసియేషన్ సభ్యులు చిడెం శ్రీనివాసరావు, శ్రీనాథ్, మరియు తదితరులు పాల్గొన్నారు.












