అలేరు, 2026-06-28
మోడీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దుకై, వేతనాల పెంపుదలకై పోరాడాలని టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టియుసిఐ కార్యాలయంలో జరిగిన మణుగూరు ఏరియా టియుసిఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోడీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దుకై, వేతనాల పెంపుదలకై పోరాడుదాం అని టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి కార్మికులను కోరారు. ఆదివారం స్థానిక టియుసిఐ కార్యాలయంలో జరిగిన మణుగూరు ఏరియా టియుసిఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. దేశంలో ఉన్న బడా పెట్టుబడిదారులైన ఆదానీ, అంబానీలకు దేశ సంపదను, కార్మిక వర్గ శ్రమ శక్తిని దోచిపెట్టడానికి స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం విదేశీ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నదని, అసమాన వాణిజ్య ఒప్పందాలను చేస్తూ, అందులో భాగంగా అమెరికా సామ్రాజ్యంతో అంటగాగుతున్నదని అన్నారు.
ఫలితంగా పెట్రోల్, డీజిల్, ఎల్పిజి గ్యాస్ కొరతకు, ధరల పెరుగుదలకు కారణమైందని, ధరల పెరుగుదలతో కార్మికుల జీవనం అతలాకుతలం అవుతుందన్నారు. అనేక సంవత్సరాలుగా కనీస వేతనాలు పెంచకపోవడం మూలంగా, కార్మిక వర్గం ఇబ్బందులకు గురవుతుందని, రాష్ట్రాలు లేబర్ కోడ్స్ అమలుకు పూనుకుంటూ అతి తక్కువ కనీస వేతనాలను ప్రకటించడం దుర్మార్గమైనదని విమర్శించారు. అందుకని కనీస వేతనాల పెరుగుదలకై, నేడున్న ధరలకు అనుగుణంగా, ఆక్రాయిడ్ సూత్రం ప్రకారం పెంచే విధంగా ఉద్యమించాలని కార్మికులను కోరారు.
ఈ సమావేశంలో టి యు సి ఐ మణుగూరు ఏరియా అధ్యక్షులు జెల్ల. అశోక్, ఏరియా సహాయ కార్యదర్శి పి. సంజీవరెడ్డి, ఏరియా నాయకులు మిట్టపల్లి. రాజేందర్, ఆర్. వెంకటేశ్వర్లు, జే. యాకన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు.








