గ్రామ పంచాయతి కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహించారు.
భద్రాచలం లో MLA క్యాంప్ ఆఫీస్ ముందు గ్రామ పంచాయతి కార్మికుల సమస్యలపై ధర్నా జరిగింది. CITU జిల్లా కార్యదర్శి ఎ.జె రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో వేతనాలు పెరగలేదని విమర్శించారు.
ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 వేల మంది గ్రామ పంచాయతి కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సాచివేత ధోరణితో వ్యవహరిస్తున్నందుకు నిరసనగా జరిగింది.
ధర్నా సందర్భంగా MLA తెల్లం వెంకట్రావు కి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించనున్నారని హామీ ఇచ్చారు.












