** (సహస్ర) జూన్ 27
ఆదివాసి సంక్షేమ పరిషత్ - తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివాసి చట్టాలు, హక్కుల రక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో అమలులో ఉన్న చట్టాలకు వ్యతిరేకంగా గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ భద్రాచలంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం నిర్వహించింది.
ఆదివాసి సంక్షేమ పరిషత్ - తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివాసి చట్టాలు, హక్కుల రక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో అమలులో ఉన్న 1/59, 1/70 చట్టాలకు వ్యతిరేకంగా 1700 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం భద్రాచలంలో జరిగింది. ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
ఆదివాసులకు చట్టాలు అమలులో ఉన్నాయని భ్రమలో ఉంటే అవి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను గిరిజనేతరులు కబ్జా చేసి అనుభవిస్తున్నా రెవిన్యూ, ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై మండిపడ్డారు. ఆదివాసి చట్టాలు, హక్కులు రక్షించటం కొరకు ఆదివాసి యువతీ యువకులు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరచాలని కోరారు. కొమురం భీం ఆశయాలను నెరవేర్చాలని, ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని 'మేలుకో ఆదివాసి - నీ చట్టాలను కాపాడుకో' అనే పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ జాతీయ నాయకులు కొర్స వెంకటేశ్వర్లు, ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి జయ బాబు, ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం కామరాజు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఈసాల సురేష్, రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు రవి, ములుగు జిల్లా నాయకులు పర్షిక సతీష్, తుర్స కృష్ణ బాబు, తాటి రాంబాబు, మీడియం అర్జున్ ముఖ్య నాయకులతో పాటు ఆదివాసి ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












