వాజేడు, 19 November
పూర్వపు చేతి వృత్తులను అంతం చేయకూడదని, నైపుణ్య మార్పిడి, వస్తు మార్పిడిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ములుగు జిల్లా వాజేడ్ మండల కేంద్రంలోని ఇప్పగూడెం గ్రామంలో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ధర్మారం క్లస్టర్ కోఆర్డినేటర్ (ఐ కె పి) పి.సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పూర్వపు చేతి వృత్తులను అంతం చేయకూడదని, నైపుణ్య మార్పిడి, వస్తు మార్పిడిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ములుగు జిల్లా వాజేడ్ మండల కేంద్రంలోని ఇప్పగూడెం గ్రామంలో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ధర్మారం క్లస్టర్ కోఆర్డినేటర్ (ఐ కె పి) పి.సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామూహిక అభ్యసనం, సహకారం, స్థానిక ఆర్థిక వినిమయాన్ని ప్రోత్సహించేందుకు 70 మంది కమ్యూనిటీ ఆధారిత సంస్థల (సీబీఓ) సభ్యులు, యువత కోసం నైపుణ్య వినిమయ, వస్తు మార్పిడి దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో, పాల్గొనేవారు చేతివృత్తులు, సాంప్రదాయ ఆహార తయారీ, చిన్న మరమ్మతు పనులు, వ్యవసాయ పద్ధతులు, ఇతర జీవనోపాధి నైపుణ్యాల వంటి వివిధ స్థానిక నైపుణ్యాలను వినియోగించుకోవాలని ధర్మవరం క్లస్టర్ కోఆర్డినేటర్ పి సత్యనారాయణ అన్నారు.
పూర్వం ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు జీవన విధానంలో నైపుణ్య మార్పిడి, వస్తు మార్పిడిపై ఎక్కువగా ఆధారపడి జీవనం కొనసాగించేవారు. ఎవరి దగ్గరైనా ఒక నైపుణ్యం ఉంటే, వారు ఇతరులకు నేర్పించి, వారి దగ్గర నుండి మరో నైపుణ్యాన్ని నేర్చుకునేవారు. అప్పట్లో జీవనం డబ్బుతో ముడిపడి ఉండేది కాదు. అలాగే వస్తు మార్పిడిలో, ఎవరి దగ్గరైనా ఒక వస్తువు ఉంటే, అవసరానికి తీసుకొని, అవసరం తీరాక తిరిగి ఇచ్చేసి, వారి దగ్గర ఉన్న వస్తువును వీరు తీసుకునేవారు. ఇలా పూర్వీకులు ఆ విధానాన్ని కొనసాగించేవారు. కానీ నేటి సమాజంలో పనులు డబ్బుతోనే ముడిపడి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నైపుణ్య మార్పిడి, వస్తు మార్పిడి దినోత్సవం సందర్భంగా కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమం వస్తు మార్పిడి వ్యవస్థను కూడా ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా సమాజ సభ్యులు డబ్బు లేకుండా వస్తువులు, సేవలను మార్పిడి చేసుకోవచ్చు. తద్వారా పరస్పర మద్దతు, స్థానిక వనరుల భాగస్వామ్యం బలపడతాయి. ఈ చొరవ, పాల్గొనేవారికి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, స్థానిక జ్ఞానాన్ని గౌరవించడానికి, బలమైన సామాజిక సంబంధాలను నిర్మించుకోవడానికి సహాయపడటంతో పాటు, స్వావలంబనను కూడా ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమానికి వాజేడ్ మండల కోఆర్డినేటర్ గొంది కామేష్ వెంకటాపురం మండలం కోఆర్డినేటర్ హనుమంతు, యానిమేటర్లు భాస్కర్, రమాదేవి, దీపిక, స్వరూప, ప్రసాదు, సీబీఓ సభ్యులు, గ్రామస్తులు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







