భద్రాచలం, 15 July
భద్రాచలం ఏరియా హాస్పిటల్లో సిబ్బంది కొరత, కనీస సౌకర్యాల లేమి వంటి సమస్యలపై BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సమస్యలపై దృష్టి సారించడం లేదని పార్టీ నాయకులు ఆరోపించారు.
భద్రాచలం పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో నెలకొన్న సమస్యలపై భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ భద్రాచలం కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్ నాయకులు మానె రామకృష్ణ, భద్రాచలం ఏరియా హాస్పిటల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఆరోపించారు. చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఏరియా హాస్పిటల్లోని సమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శించారు.
వర్షాకాలం సమీపిస్తున్నా కనీసం సిబ్బందిని నియమించలేదని, ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని దుయ్యబట్టారు. తక్షణమే సిబ్బందిని నియమించి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో BRS పార్టీ ఆధ్వర్యంలో పెద్దయెత్తున పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు.











