భద్రాచలం, 15-7-2026
దేశంలో పాలకులు మారుతున్నా రైతుల జీవితాల్లో మార్పు రావడం లేదని, అలాంటి రైతాంగం కోసం అహర్నిశలు శ్రమించి, వారి హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆదర్శ రైతుల పక్షపాతి, అమరుడు రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సభ భద్రాచలం డివిజన్ పార్టీ ఆఫీసులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న ఆశయాలను సాధిద్దామని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కె. రంగారెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సభలో ఆయన మాట్లాడుతూ, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రైతాంగ ఉద్యమంలో అఖిలభారత స్థాయి నాయకుడిగా ఉత్తర భారత దేశ పర్యటన చేశారని తెలిపారు. చారిత్రాత్మకమైన ఢిల్లీ సరిహద్దులో కొనసాగిన రైతాంగ పోరాటంలో పాల్గొని, మూడు నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు చంద్రశేఖర్ పోరాటంలో కొనసాగారని అన్నారు. ఎమర్జెన్సీ అనంతరం సీపీఐ (ఎంఎల్) పార్టీ ఇచ్చిన పిలుపుని అందుకొని రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర నాయకుడిగా, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా ఎదిగిన నాయకుడు మన మధ్య దూరం కావడం తీరని నష్టమని అన్నారు.
ఖమ్మం పట్టణంలో జరిగే రాయల చంద్రశేఖర్ అన్న రెండో వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 16న పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో సంతాప సభ జరుగుతుందని, దీనిని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కల్పనక్క, దాసరి సాయన్న, మునిగేలా శివ ప్రశాంత్, ప్రణయ్, శాంతక్క, సరళ తదితరులు పాల్గొన్నారు.