చర్ల మండల పరిధిలోని ఎర్రంపాడు, తిప్పాపురం అంగన్వాడీ కేంద్రాలలో "అమ్మ మాట – అంగన్వాడి బడిబాట" కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల విద్యాభివృద్ధి, అంగన్వాడీ సేవల ప్రాధాన్యతపై గ్రామ ప్రజల్లో అవగాహన కల్పించారు.
"అమ్మ మాట అంగన్వాడి బడిబాట" అనే నినాదంతో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడం, వారికి ప్రాథమిక విద్యతో పాటు పోషకాహారం అందించడం వంటి అంశాలపై ప్రజలకు వివరించారు.
ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు అంగన్వాడీలు ఎంతగానో దోహదపడతాయని, పిల్లల సమగ్ర వికాసానికి ఇవి పునాదిగా నిలుస్తాయని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా కేంద్రాలకు పంపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి చిన్నారి అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.












