Charla, 7 July
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ 61వ జన్మదినం, అలాగే ఎంఆర్పీఎస్ స్థాపించి 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చర్ల మండల ఎంఆర్పీఎస్ నాయకులు మంగళవారం ఘనంగా జెండా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మంద కృష్ణ మాదిగ మాదిగ సమాజం అభ్యున్నతి కోసం చేసిన సేవలను, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సాగించిన ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు మచ్చా వీర్రాజు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ అంశంలో మంద కృష్ణ మాదిగ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని అన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగానే దేశ నాయకులు సైతం గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. వికలాంగులు, వితంతువులు, పేదల సంక్షేమం కోసం పెన్షన్లు అందించే విషయంలో కూడా ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు మచ్చా రాజా, చెన్నం రామ్మూర్తి, మచ్చా వీర్రాజు, శ్రీకాంత్, గణేష్, ఆటో యూనియన్ అధ్యక్షుడు పామర్రు బాలాజీ, యూనియన్ సభ్యులు, రేగళ్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.