భద్రాచలం, జులై 7
మాదిగల పండుగగా భావించే జులై 7న, భద్రాచలంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలను మహాజన మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టి, నాయకుల ప్రసంగాలతో వేడుకలు మార్మోగాయి.
జులై 7న మాదిగల పండుగ రోజున, ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదినం సందర్భంగా భద్రాచలంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మహాజన మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ముందుగా వివిధ కాలనీలలో జండా ఆవిష్కరణ చేసి, అంబేద్కర్ సెంటర్లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్, మిఠాయి పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక ఉద్యమ నాయకులు, ఎమ్మార్పీఎస్ గౌరవ సలహాదారులు డాక్టర్ భాను ప్రసాద్, మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత లు మాట్లాడుతూ, ప్రజల అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీకగా సమాజం చేత కొనియాడబడుతున్న మాదిగ జాతికి పద్మశ్రీ పురస్కారం అందించి, ఎస్సి రిజర్వేషన్ల సమాన పంపిణీకి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాత్రమే పితామహుడని కొనియాడారు. భారత దేశ చరిత్రలో 32 ఏళ్ల ఎమ్మార్పీఎస్ పోరాటం తెలుగు నేల మీద పుట్టి, మాదిగ దండోరా ఉద్యమం దేశంలో నూతన సామాజిక విప్లవాన్ని సృష్టించిందని గుర్తు చేశారు.
32 ఏండ్లుగా ప్రజల విశ్వాసాన్ని, అభిమానాలను పొంది సుదీర్ఘకాలంగా నిలబడిన రాజకీయేతర ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ ఉద్యమం మాత్రమేనని అన్నారు. మాదిగ, మాదిగ ఉపకులాల్లో ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవానికి నాంది పలికింది ఎమ్మార్పీఎస్ అని, అంతేకాకుండా దోపిడీకి, అణచివేతకు గురైన అన్ని కులాల్లో కూడా పోరాట స్ఫూర్తిని నింపిన సామాజిక ఉద్యమ పితామహులు, అనగారిన గొంతుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ ఘనత దక్కుతుందని అన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అనేది కేవలం పేరు కాదని, అదొక నినాదం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అలవాల పెరియార్ రాజా మాదిగ, కొమ్మగిరి వెంకటేశ్వర్లు మాదిగ, కొప్పుల తిరుపతి మాదిగ, గురుజాల వెంకటేశ్వర్లు మాదిగ, మేడ్చల్ లక్ష్మణ్ మాదిగ, కనుకు శ్రీను మాదిగ, చన్నం కృష్ణ మాదిగ, తిప్పనపల్లి ఆనంద్ మాదిగ, మంద నరేష్ మాదిగ, పుల్లారావు, ప్రవీణ్, మహాజన మహిళా సమైక్య జిల్లా నాయకులు కొచ్చర్ల కుమారి, కొప్పుల నాగమణి, నారాయణమ్మ, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.










