ఆధ్వర్యంలో (ప్రజా వాయిస్ సహస్ర) సెప్టెంబర్ 03
మణుగూరు మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీల నిర్వహణపై మండల విద్యాశాఖాధికారి జి. స్వర్ణ జ్యోతి మణుగూరు మండల ఎంఆర్సీలో సమావేశం జరిగింది. ఈ నెల 9, 10 తేదీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహించనున్నారు.
పత్రిక ప్రచురణ మణుగూరు మండల స్థాయి క్రీడా పోటీల ఏర్పాట్లపై సమావేశం... - మణుగూరు ఎంఈఓ జి. స్వర్ణ జ్యోతి మణుగూరు మణుగూరు మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీల నిర్వహణపై మణుగూరు మండల ఎం ఆర్ సి నందు సమావేశం నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి జీ. స్వర్ణ జ్యోతి మండలంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 9,10 తేదీలలో మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అండర్-14, అండర్-17 బాల బాలికల విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మరియు అథ్లెటిక్స్ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మణుగూరు మండల వ్యాయామ ఉపాధ్యాయులు ఆదినారాయణ, అనిల్ కుమార్, సురేష్, కావ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.








